డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మెగా ఫోన్ పట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్స్ ఇచ్చాడు పూరి.. అలాగే ఫ్లాప్స్ కూడా ఇచ్చాడు. కానీ ఈ మధ్యనే కాస్త వెనకబడిపోయాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో సాలిడ్ హిట్ కొట్టినప్పటికీ.. ‘లైగర్’ పూరిని కోలుకోలేని దెబ్బేసింది. అయితే పడిలేవడం పూరికి కొత్తేం కాదు.. కానీ ఇలాంటి సమయంలో పూరి ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ సినిమా ‘బద్రి’ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాడు పూరి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పూరికి బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు పూరి. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించిన బద్రి సినిమా.. 2000 ఏప్రిల్ 20న రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బద్రి. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బద్రి సినిమాను రీ మాస్టర్డ్ వెర్షన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 30న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే బద్రి రీ రిలీజ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక బద్రి మూవీలో పవన్ మేనరిజమ్, సాంగ్స్, డైలాగ్స్, ఫైట్స్.. ఇలా అన్ని కూడా హైలెటే. రమణ గోగుల మ్యూజిక్ ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. మొత్తంగా పూరి, పవన్ కెరీర్లో ‘బద్రి’ ఓ మైలురాయిగా నిలిచిపోయింది.