TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమకు అండగా నిలిచిన MIMకు ధన్యవాదాలు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో MIM మాకు పూర్తిగా సహకరించింది. MIMతో పాటు, CPI, CPM, కోదండరాం కూడా మాకు మద్దతుగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాగా, డిసెంబర్లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తామన్నారు.