TPT: పిచ్చాటూరులోని MKT మహల్లో 15వ తేదీన జాబ్ మేళా జరగనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 15 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. అనంతరం మొత్తం 750 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.