AP: నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో వారికి హెయిర్ సెలూన్ షాపులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీ చేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, అధికారులకు సూచనలు చేసింది.