టీమిండియాపై రోహిత్ శర్మ, కోహ్లీ ప్రశంసలు కురిపించారు. భారత జట్టులోని ప్రతిఒక్కరూ అద్భుతమైన ఆటతీరు కనబరిచారని రోహిత్ అభినందించాడు. అలాగే, మరోసారి ఛాంపియన్లుగా నిలిచామని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించాం. సంజూ శాంసన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచాడు. ఇంత ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మరెవరూ సరితూగలేరు’ అని కోహ్లీ కొనియాడాడు.