TG: గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. అయిజ నుంచి సుమారు 90 మంది ప్రయాణికులతో కర్నులు వెళ్తున్న బస్సు నుంచి పొగలు వచ్చాయి. మద్దూరు స్టేజీ వద్ద వెనకాల టైర్‌లోని బేరింగ్ నుంచి ఇవి వస్తున్నట్లు అద్దం నుంచి గమనించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను దించేశాడు. దీంతో ప్రమాదం తప్పి, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.