»Ktrs Presentation On The Achievements Of Telangana At The American Stage
Minister KTR : తెలంగాణ సాధించిన విజయాలపై అమెరికా వేదికగా కేటీఆర్ ప్రజెంటేషన్
అమెరికా (America) నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు.
అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR).. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సౌకర్యాలు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతర అంశాలను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఏయే అంశాల్లో ఉత్తమంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇచ్చే రాయితీలు, టీఎస్ బీపాస్ లాంటి విధానాల గురించి చెబుతూ ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు పూర్తి చేసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా(America)లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయగాథలను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివరించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పలు రంగాల్లో సాధించిన విజయాలను అమెరికా ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎదుర్కొన్న కష్టాలు, పల్లం నుంచి ఎత్తుకు గోదావరి నదీ (Godavari river) జలాలను ఎత్తిపోసేందుకు సీఎం కేసీఆరే ఇంజినీర్‌గా మారిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి రూపకల్పన చేసిన తీరు, నాలుగేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసిన తీరుపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాలువ నిర్మాణం, పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్‌లు, ప్రాజెక్టులో వినియోగించిన స్టీల్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు .ప్రాజెక్టు నిర్మాణంతో దేశంలోనే వరిసాగులో రెండోస్థానానికి చేరిన తీరును వివరించారు. తెలంగాణవ్యాప్తంగా తాగునీటి కష్టాలను తీర్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ(Mission Bhagiratha) ప్రాజెక్టు, దాంతో వందశాతం ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నట్లు ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. పెరిగిన మత్స్య సంపద, పాల ఉత్పత్తి, ఆయిల్ పామ్ సాగు, గొల్లకురమలకు పంపిణీ చేసిన గొర్రెల పంపిణీతో పెరిగిన మాంసం ఉత్పత్తులు ఎలా పెరిగాయో ప్రజెంటేషన్ ద్వారా ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు వివరించారు.