హైదరాబాద్ ప్రేక్షకులకు సరికొత్త దృశ్యకావ్య అనుభూతిని అందించేందుకు కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ సిద్ధమైంది. నగరంలోనే మొదటి డాల్బీ సినిమా (Dolby Cinema) థియేటర్ను ఇక్కడ అధికారికంగా ప్రారంభించనున్నారు. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ప్రీమియర్ షోలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.