S.S.రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘SSMB29’ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తారనే చర్చ జరగుతోంది. అయితే, ‘SSMB29’ తర్వాత రాజమౌళి మరోసారి ప్రభాస్తో కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమా కోసం బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఒక కథాంశాన్ని కూడా సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది.