KDP: దువ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమునిపాడు గ్రామంలో దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు.