AP: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ సీఎం జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ‘ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం. మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.