TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోందని ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కర్ణన్ పేర్కొన్నారు. 11 ప్రాంతాల్లో EVMల సమస్య తలెత్తడంతో రిజర్వ్ EVMలను రీప్లేస్ చేసినట్లు తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాగా, బోరబండ పోలింగ్ బూత్ 348, షేక్పేట్ డివిజన్లోని పోలింగ్ బూత్-30లో EVM మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.