AP: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విశాఖలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ‘ఈనెల 12న విశాఖ సాగరతీరం, 17న గాజువాకలో యూనిటీ మార్చ్ ఉండనుంది. యూనిటీ మార్చ్‌ను సేవాసంఘాలు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలి. విశాఖ సీఐఐ సమ్మిట్‌లో 400కు పైగా ఒప్పందాలు జరుగుతాయి. దాదాపు 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా’ అని పేర్కొన్నారు.