SRCL: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ హఠాన్మరణం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి ఇది ఎప్పటికీ పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. మలిదశ ఉద్యమ కెరటమై, రాష్ట్ర సాధన ఆకాంక్షను కోట్లాది ప్రజల గుండెల్లో బలంగా నిలిపిన చారిత్రక గీతాన్ని అందించిన మహనీయుడు అన్నారు.