కృష్ణా: ప్రముఖ పుణ్య క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఒక్కరోజులో సేవల టిక్కెట్ల ద్వారా రూ.12,24,960 ఆదాయం లభించినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.