»Journalist Accreditation For Youtube Channels Nara Lokesh
Yuvagalam : యూట్యూబ్ ఛానెల్స్ కు జర్నలిస్టు అక్రిడిటేషన్ : నారా లోకేశ్
నంద్యాల నియోజకవర్గంలో నారాలోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా పలు వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్ భేటీ అయ్యారు.
టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే యూట్యూబ్ ఛానెల్స్ (YouTube channels)కూడా జర్నలిస్టు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. జర్నలిస్టులను వైసీపీ ప్రభుత్వం(YCP Govt)అనేక విధాలుగా వేధిస్తోందని నారా లోకేశ్ ఆరోపించారు.లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర బనగానపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. బనగానపల్లి (Banaganapally) నియోజకవర్గం టంగుటూరులో యువనేత చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆయనకు ఘనస్వాగతం లభించింది. పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాలతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు.నంద్యాల (Nandyala)నియోజకవర్గం రాయపాడు క్యాంప్ సైట్ లో తటస్థ ప్రముఖులతో లోకేశ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR)కి ఎందుకు నివాళులు అర్పించారు అని కొంతమంది నన్ను అడిగారు, నేను వైఎస్ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. చంద్రబాబు (Chandrababu) తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్ని కొనసాగించారు, అందుకే ఆయనంటే గౌరవం” అని వివరించారు. ఇక, జగన్ రాష్ట్రం పరువు తీశాడని, దక్షిణాది బీహార్ గా ఏపీని మార్చేశాడని విమర్శించారు.