HYDలోని హుస్సేన్ సాగర్ లేక్ ప్రాంతంలో ఆత్మహత్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలు 24 గంటలు నిరంతరం గస్తీ కాస్తున్నట్లు తెలిపారు. పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని కొందరు సూసైడ్ స్పాట్‌గా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.