విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కోసం 4 వేల కోట్లు రెడీ చేశానని కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తీర్చేస్తాని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది..కుటుంబ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేద్దాం రండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాపు, బీసీ ఎస్సీలు అందరూ కలిసి రండి..నేను తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా..వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి కలిసి పనిచేద్దాం రండి అంటూ పాల్ కోరారు .జేడి లక్ష్మి నారాయణ(JD Lakshmi Narayana)ను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని అన్నారు. గద్దర్ (Gaddar) లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.
ఏపి, తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానని తెలిపారు. నా ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) నుంచి అన్ని స్థానాల్లోను పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. ఇదే సందర్బంగా కేఏ పాల్ మరోసారి చంద్రబాబు(Chandrababu), పవన్ లపై విమర్శలు చేశారు.చంద్రబాబు విశాఖ రావడం అనవసరమన్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. జనసైనికులు లోకేష్ జెండా మోయకండి. వంగవీటి రంగా (Vangaveeti Ranga) ఆత్మ గోషిస్తుంది అంటూ ఆయన సూచించారు. పవన్ లాంటి వ్యక్తుల వలనే బీసీలు ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరం..ఆయన సింగపూర్ (Singapore) లో సెటిల్ అయితే మంచిది అంటూ సలహాలిచ్చారు. కాగా కొన్ని రోజుల క్రితం పాల్ మాట్లాడుతు..స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా ఉండటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు