కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ మాజీ కౌన్సిలర్, ఆర్ఎంపి వైద్యుడు జనపల్లి రమేష్ బాబు బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అమలాపురం వెళ్లి వస్తున్న ఆయన మోటార్ సైకిల్‌కు స్థానిక మూలతూము సమీపంలో కుక్క అడ్డురా వడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆయనను స్థానికులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.