VKB: పెద్దేముల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. ఆలయ పూజారి, స్థానికులు ఈవిషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, చోరీ వివరాలను సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.