PPM: పాచిపెంట OS ఆర్టీసీ బస్సు దగ్ధంపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఘటనపై ఎస్పీ మాధవరెడ్డిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎస్పీ ఆయనకు వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.