ELR: భీమడోలులోని ఆగడాలలంకలోని పాడుబడ్డ ఇంట్లో నడుస్తున్న పేకాట స్థావరంపై భీమడోలు పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై ఎస్కే మదీనా భాషా సిబ్బందితో కలిసి రైడ్ చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.42,700 నగదు, 52 పేకముక్కలు స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.