NRPT: మరికల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మూడు నియోజకవర్గాలకు ముఖ్య కూడలిగా ఉన్న మరికల్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.