NZB: నవీపేట్ మండలంలోని ఫతేనగర్ శివారులో గత నెల 24వ తేదీన పెట్రోల్ పోసి మహిళను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు NZB ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతిలు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. గత నెల 24వ తేదీన ఫతేనగర్ శివారు ప్రాంతంలో మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అలియాస్ బుజ్జిని పెట్రోల్ పోసి తగలబెట్టారు.