»Bengaluru Grand Win Over Srh With Virats Century For Four After Years In Ipl Season
IPL 2023: నాలుగేళ్లకు విరాట్ సెంచరీతో.. SRHపై బెంగళూరు గ్రాండ్ విక్టరీ
విరాట్ కోహ్లీ(virat kohli) సెంచరీ, డు ప్లెసిస్ భాగస్వామ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు..సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీంను నిన్న ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో RCB జట్టు IPL 2023లో ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
IPL 2023లో నిన్న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 65వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగింది. ఆ క్రమంలో 63 బంతుల్లో 100 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. దీంతోపాటు ఫాఫ్ డు ప్లెసిస్ 47 బంతుల్లో 71 రన్స్ చేయడంతో RCB 19.2 ఓవర్లలో 187/2 పరుగులు చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన SRH ఆటగాళ్లు ఐదు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ 51 బంతుల్లో 104 రన్స్ చేసి మంచి స్కోర్ చేశాడు. దీంతోపాటు హ్యారీ బ్రూక్ 27 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఆర్సీబీ తరఫున మైకేల్ బ్రేస్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ గెలుపుతో RCB 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐదవ స్థానంలో ఉంది. దీంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మరోవైపు RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(virat kohli) ఐపీఎల్లో సెంచరీ(century) కోసం నాలుగేళ్ల నిరీక్షణకు తెర దించాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విరాట్ 63 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేశాడు. 2019 ఐపీఎల్ ఎడిషన్ లీగ్‌లో కోహ్లీ చివరి సెంచరీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. అయితే అప్పుడు కూడా యాదృచ్ఛికంగా 100 పరుగులు చేయడం విశేషం.