SDPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జంకి మండలం పెర్కబండ గ్రామంలో బాల వికాస సమితి ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళలు విద్య, ఐక్యతతో ముందుకు సాగాలని ప్రతినిధులు సూచించారు. సర్పంచ్ కర్రావుల స్వప్న, కార్యదర్శి నవీన పాల్గొన్నారు.