»Mp Uttams Own Party Workers Are Trolls No Leadership
Uttam Kumar Reddy : ఎంపీ ఉత్తమ్ పై సొంత పార్టీ కార్యకర్తలే ట్రోల్స్ …అధిష్టానం వేటు
యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ పై వేటు పడింది. మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో ప్రశాంత్ పై అధిష్టానం వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ప్రశాంత్ టీమ్ పై 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మే 17వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ (Nalgonda) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలే ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్, ఆయన టీమ్ ఉత్తమ్‌పై సోషల్ మీడియా(Social media)లో అనుచితమైన పోస్టులు పెట్టారు. విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు (CCS Police) ప్రశాంత్పాటు ఆయన టీమ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వార్ రూమ్‌పై దాడి చేసి కంప్యూటర్లు,(Computers) హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సొంత పార్టీకి చెందిన వారిపై ట్రోలింగ్ చేసినందుకు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూత్ కాంగ్రెస్ (Youth Congress) వార్ రూమ్ ఇన్ఛార్జ్ ప్రశాంత్‌పై వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రశాంత్ (Prashant)తో పాటు మరో నలుగురిపై పోలీసులు ఐపీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా గత కొంతకాలంగా ఉత్తమ్‌తో పాటు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), వీ హనుమంతరావు, జగ్గారెడ్డి తదితర సీనియర్లపై ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో మే 5న ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నెంబర్ నుంచి తనపై పదే పదే ట్రోలింగ్ జరుగుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ నెంబర్ ఆధారంగా కూపీ లాగారు. ఉత్తమ్ ఇంటికి సమీపంలోని ఫ్లాట్ నుంచి ట్రోలింగ్ జరుగుతున్నట్లుగా గుర్తించి సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు. సదరు ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో వున్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రశాంత్ పై వేటు వేసింది. అటు ప్రశాంత్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా సైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) నోటీసులు ఇచ్చారు.