»Aggressive Cbi Key Development In Vivekas Murder Case
YS Sunitha Reddy : దూకుడు పెంచిన సీబీఐ.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం
ఇవాళే సీబీఐ విచారణకు వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy), భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ఈ ఇద్దరూ సీబీఐ ఎదుట హాజరవ్వగా.. తాజాగా మరోసారి విచారణకు రావడంతో ఉత్కంఠ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య(Murder of YS Viveka) కేసులో సీబీఐ దూకుడు పెంచింది.హైదరాబాద్ లోని సీబీఐ(CBI) కార్యాలయానికి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత, భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి (Rajasekhara Reddy) వచ్చారు. వారిని సీబీఐ అధికారులు పిలిచినట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు వారిని పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు సునీత దంపతులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీబీఐ. వారిని ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(MP YS Avinash Reddy)కి సైతం ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల నేడు విచారణకు హాజరకాలేనని సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీబీఐ.. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, భాస్కర రెడ్డి(Bhaskara Reddy) డ్రైవర్ కు కూడా సీబీఐ నోటీసులు పంపించింది.