»Massive Explosion In Fireworks Factory 9 People Died
West Bengal: బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లోని ఎగ్రాలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఎగ్రాలోని సహారా ప్రాంతంలోని గోపీనాథ్‌పూర్ చంద్‌కూరి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో ఈ దారుణం జరిగింది. ఈ పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై సీఐడీ విచారణ జరుపుతుందని పోలీసులు వెల్లడించారు.
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా బాణాసంచా కర్మాగారం నిర్వహిస్తున్న యజమానిని ఇటీవలే అరెస్టు చేసినా బెయిల్ పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. అతనికి బెయిల్ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamatha Benarji) వెల్లడించారు.