కృష్ణా: విజయవాడ నగరంలో ముంపునకు గురైన కుటుంబాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టవల్స్, బట్టలను, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ జి సమరం, వెలగ జోషి, సెక్రటరీ చిట్టిబాబు పలు ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు దేశవ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని తెలిపారు.