SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిందని ప్రాజెక్టు ఏఈఈ మైపాల్ రెడ్డి గురువారం ఉదయం తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా 13,388 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 6,634 దిగువకు రిలీజ్ చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.133 టీఎంసీలకు నీటిమట్టం చేరిందన్నారు.