»Opposition Parties Triumphed In Thailands Elections
Thailand : థాయిలాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు విజయ ఢంకా
2019లో జరిగిన గత ఎన్నికలలో ఫ్యూ థాయ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది, అయితే దాని ఆర్కైవల్, మిలటరీ(Military)-మద్దతుగల పలాంగ్ ప్రచారత్ పార్టీ, ప్రయుత్తో కలిసి ప్రధానమంత్రిగా సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. ఇది సెనేట్ నుండి ఏకగ్రీవ మద్దతుపై ఆధారపడింది, దీని సభ్యులు ప్రయుత్(Prayut) యొక్క తిరుగుబాటు తర్వాత సైనిక ప్రభుత్వంచే నియమించబడ్డారు మరియు దాని సంప్రదాయవాద దృక్పథాన్ని పంచుకున్నారు.
థాయిలాండ్ (Thailand) ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఘన విజయం సాధించాయి. పదేండ్ల కన్జర్వేటివ్ (Conservative), ఆర్మీ పాలనకు థాయిలాండ్ ప్రజలు ముగింపు పలికారు. మూవ్ ఫార్వార్డ్ పార్టీ(Move forward party), ఫ్యూ థాయ్ పార్టీకి థాయిలాండ్ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారు. దేశంలో సమూల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా థాయ్లాండ్ ఓటర్లు అద్భుతమైన తీర్పును అందించారు. దిగువ సభలోని 500 సీట్లలో 151 సీట్లను పిటా లిమ్జారోయెన్రాట్ నేతృత్వంలోని మూవ్ ఫార్వర్డ్ పార్టీ విజయ ఢంకా మోగించింది. అయితే ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురి మద్దతు కూడగట్టాల్సి ఉంది. సెనేట్ సభ్యుల మద్దతు తప్పనిసరి. మిలటరీ పార్టీల సహకారం కూడా అవసరం. వీరి మద్దతుతోనే ప్రధాని కాగలరు. అనంతరం తమ పరిపాలనను ప్రధాని కొనసాగించే అవకాశం ఉంటుంది.
అయితే ఏ పార్టీకి వీరి మద్దతు ఉంటుందనేది తేలాల్సి ఉంది. యువ ఓటర్ల నుంచి లిబరల్ మూవ్ ఫార్వార్డ్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు లభించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్(Bangkok)లో కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా లిబరల్ మూవ్ ఫార్వార్డ్ పార్టీ ప్రధాని అభ్యర్థి.. మూవ్ ఫార్వార్డ్ లీడర్ పీటా (Limjaroenrat)(42) మాట్లాడుతూ.. తాము తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సంచలన తీర్పు అని పేర్కొన్నారు. మిలటరీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని తెలిపారు. పాపులిస్ట్ ఫ్యూ థాయ్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
పాపులిస్ట్ ఫ్యూ థాయ్ పార్టీ కూడా ప్రధాని పదవికి పోటీ పడుతోంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి పేటోంగ్టార్న్ షినవత్రా(Paytongtarn Shinawatra) కూడా బరిలో ఉన్నారు. ఈ పార్టీ కూడా థాయ్ ఎన్నికల్లో మంచి మద్దతును కూడగట్టుకుంది. 2001 నుంచి 2006 వరకు తక్షిన్ షినవత్రా ప్రధానిగా ఉన్నారు. 2006 నుంచి 2014 వరకు ఆయన సోదారి ఇంగ్లాక్ షినవత్రా ప్రధాని పదవిలో కొనసాగారు. తక్షిన్, ఇంగ్లాక్ థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. తదనంతరం దశాబ్ద కాలం పాటు థాయ్లో ఆర్మీ పాలన కొనసాగింది.