Mexico:మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం జరిగింది. తమౌలిపాస్ రాష్ట్రంలో ట్రక్ ట్రైలర్-వ్యాన్ ఢీ కొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు. సియుడాడ్ విక్టోరియాలో గల హైవేపై వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. వ్యాన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చెందినది. ఆ వాహనంలో ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొందరు చిన్నారులు కూడా కూర్చొన్నారు.
ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లేసరికి ట్రక్ (truck) అక్కడ లేదని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిని గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాల వద్ద ఉన్న ఐడీ కార్డ్స్ తీసుకున్నారు. ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ చనిపోయాడా..? లేదంటే పారిపోయాడా అనే విషయం తెలియలేదు. ప్రమాదంతో హైవే మీద భీతావాహ వాతావరణం నెలకొంది.