AP: మొంథా తుఫాన్ తీవ్రతపై మంత్రి లోకేష్ సమీక్షించారు. సచివాలయంలోని RGTS కేంద్రం ద్వారా రాష్ట్రంలోని జిల్లాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పరిస్థితులను అంచనా వేస్తూ సహాయ, పునరావాస చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాల్లోని ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.