ATP: అనంతపురం నగరానికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి హిజ్రా ముసుగులో దందా నిర్వహిస్తూ తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని హిజ్రాలు వాపోయారు. అతనిపై తక్షణమే చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వారు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పోలీసులకు అందజేశారు.