NRML: సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, అప్గ్రేడ్ పనులకు గాను రూ.69.10 లక్షల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులు పూర్తయితే దిగువ ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.