BDK: అశ్వారావుపేట బస్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండల కేంద్రానికి కొత్త బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. జెండా ఊపి బస్సును ప్రారంభించి ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ప్రజలకు రవాణా సౌకర్యం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న చోట ఇలాంటి సర్వీసులు మరిన్ని ప్రారంభిస్తామని తెలిపారు.