GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం తెనాలి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా ఆమె కొలకలూరు, నందివెలుగు గ్రామాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.