KNR: కరీంనగర్లో తెలంగాణ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. శివలింగం ఆధ్వర్యంలో ఇక్కడ సాధారణ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 159 మున్సిపాలిటీలు/ కార్పొరేషన్ల నుంచి సుమారు 180 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (AO), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు (JAO), ఇతర అకౌంటెంట్లు హాజరయ్యారు.