VSP: గాజువాకలో వారం రోజుల క్రితం ఆటోనగర్-తుంగ్లాం మార్గంలో జరిగిన లారీ డ్రైవర్ మిరాజ్ హుస్సేన్ (35) హత్య కేసును గాజువాక పోలీసులు ఛేదించారు. మృతుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను విచారించగా, రూ.7 వేలు, సెల్ఫోన్ కోసం హుస్సేన్ను హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.