NLR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ నిర్వహించనున్న ర్యాలీని వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. తుఫాను కారణంగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం ఆదేశం పంపిందని తెలిపారు.