మంచిర్యాల జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేస్తున్నామని యుఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి వెల్లడించారు. నిజామాబాద్లో నిర్వహిస్తున్న యుఎస్ఎఫ్ఐ ప్రధమ రాష్ట్ర మహాసభలలో ఆదివారం ఆయన జిల్లా రిపోర్టును వెల్లడించారు. హాస్టల్లో మౌలిక సౌకర్యాలు పెంచాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమించామన్నారు.