KRNL: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు 40 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. 361 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని గుర్తించారు. మొత్తం రూ. 12,80,060 ఫైన్లు విధించారు. కాగా, నంద్యాల జిల్లాలో అత్యధికంగా 63 బస్సులపై కేసు నమోదు చేశారు.