JGL: విద్యుత్ వినియోగం, విద్యుత్ పరికరాల వాడకంలో అప్రమత్తంగా ఉన్నట్లయితే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని రాయికల్ ఏఈ నవీన్ అన్నారు. రాయికల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ పరికరాలకు విద్యుత్ సరఫరా ఆపివేయాలని తెలిపారు.