అమెరికన్ నటి జూన్ లాకర్ట్ (100) కన్నుమూశారు. 1925లో జన్మించిన ఆమె కాలిఫోర్నియాలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. లాస్సీ, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి TV సిరీస్లో, సార్జెంట్ యార్క్, హెవెన్ టూ, స్ట్రేంజ్ ఇన్వేడర్స్ వంటి సినిమాల్లో ఆమె నటించారు. 2021 వరకు నట ప్రస్థానాన్ని కొనసాగించారు. 8 ఏళ్ల వయసులో యాక్టింగ్ అరంగేట్రం చేసిన ఆమె దాదాపు 90 ఏళ్లపాటు ఈ రంగంలో కొనసాగారు.