ELR: చింతలపూడి మండలం వెలగలపల్లిలో శనివారం మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కర్రీ నాగసత్య వరలక్ష్మీని వ్యక్తిగత కక్షలు, అనుమానాలతో గుర్తుతెలియ దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే వరలక్ష్మీ ఆచూకీని కనుగొన్నారు.