TG: HYD ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్, రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయంపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిపారు. గ్రామీణ ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సమాలోచనలు చేశారు.