నిర్మల్లోని మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో గల భవనాన్ని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డీఈ హరిభువన్ కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుత కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయాన్ని నూతన భవనానికి తరలించాలని నిర్ణయించారు. కొత్త భవనంలో అవసరమైన మరమ్మతులు, మార్పులపై సమీక్షించారు.