SDPT: మనోహరాబాద్ మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి 10వ వార్షికోత్సవ వేడుకలు నేటి నుండి మూడు రోజుల పాటు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు గణపతి పూజ, హోమం, స్వామివారి కళ్యాణం, అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీష్సులు తీసుకోవాలని కోరారు.