వనపర్తి: విద్యా రంగంలో జిల్లా సత్తా చాటింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి నాయకత్వంలో పీఎం పోషణ్ అమలులో 95 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం, విద్యా శాఖ పనితీరు సూచికలో ద్వితీయ స్థానం సాధించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% గ్యాస్ కనెక్షన్లు కల్పించడం విశేషం. ఈ విజయాల పై ఇటీవల జరిగిన కలెక్టర్ల సమ్మిట్‌లో సీఎం కలెక్టర్‌ను అభినందించారు.